![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 లో అప్పుడే తొమ్మిది వారాలు గడిచిపోయాయి. ఈ వారం నాగార్జున ఎంట్రీలోనే సీరియస్ సింహంలాగా ఎంట్రీ ఇవ్వడంతో ఇక అందరికి మాస్ జాతరే అనుకున్నారంతా కానీ ఒక్క ప్రేరణ, గౌతమ్, నిఖిల్ కి తప్ప అందరికి కూల్ వార్నింగ్స్ తోనే సరిపెట్టేసాడు నాగ్ మామ. ప్రేరణ నువ్వు పుడింగివా అంటూ మొదలెట్టాడు నాగార్జున. డిస్ రెస్పెక్ట్ గా మాట్లాడడం తప్పు అంటు వార్నింగ్ ఇవ్వగా తను ఎమోషనల్ అయింది. ఇక నిఖిల్, గౌతమ్ ల ఆటతీరుకి స్ట్రాంగ్ కోటింగే పడింది.
నబీల్ అట తీరు బాగుంది కానీ నువ్వు నీ కోసం ఆడు.. నీ క్లాన్ వాళ్ళని కాకుండా అవినాష్ కోసం గేమ్ ఎందుకు గివ్ అప్ ఇచ్చావ్.. మెగా ఛీఫ్ టాస్క్ లో ఎందుకు ట్రై చేయలేదని అడుగగా.. నా వంతు ట్రై చేశానని కానీ మాటిచ్చాను సర్ అంటూ నబీల్ చెప్పాడు. కానీ నీ ఆట డ్రాప్ అవుతుంది. తొంభై శాతం ఇస్తున్నావ్ కానీ ఏదో మనసులో పెట్టేసుకొని నీ గేమ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావంటూ నబీల్ కి సలహా ఇచ్చాడు నాగార్జున. ఇక మెగా చీఫ్ గా పనిష్మెంట్ లు బాగా ఇస్తున్నాడంటూ అవినాష్ ని పొగిడేశాడు. నయని, పృథ్వీ, రోహిణి లు అసలేం ఆడారు.. ఏ టాస్క్ లో అయిన విన్ అయ్యారా అంటూ వాళ్ళ పరువు తీసేసాడు. ఇక ప్రతీ గేమ్ లో టేస్టీ తేజ ఆటతీరును చూసి.. చాలా బాగా ఆడావంటూ నాగార్జున మెచ్చుకోగా.. కొద్దీసేపటి వరకు నన్నేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు టేస్టీ తేజ.
ఆ తర్వాత హరితేజ బాగా ఆడావంటూ మెచ్చుకున్నాడు. యష్మీ ఆట బాగా ఆడుతుందని చెప్పాడు. విష్ణుప్రియ మెగా చీఫ్ గా బాగా చేసిందంటూ హౌస్ మేట్స్ నాగార్జునతో చెప్తారు. దాంతో నాగార్జున సైతం విష్ణుప్రియని మెచ్చుకుంటాడు. విష్ణుప్రియ మాట్లాడే మాటలకు నాగార్జున నవ్వుతుంటాడు. ఆ తర్వాత ఐదుగురు నామినేషన్ లో ఉండగా టేస్టీ తేజని శనివారం ఎపిసోడ్ లో సేవ్ చెయ్యగా.. యష్మీ, నయని, హరితేజ, గౌతమ్ లు మిగిలారు. మరి వీరిలో ఎవరు బయటకు వస్తారో తెలియాలంటే ఈరోజు(ఆదివారం) ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |